Wednesday, 4 November 2026

వడగండ్ల వర్షానికి నేలరాలిన పంటలు,

నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్
ఎమ్మెల్యే ఈటల రాజేందర్
వీణవంక మార్చి 22 (జనం సాక్షి, ) వీణవంక మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో ఈరోజు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గ్రామంలో పర్యటించారు ఇటీవల మండలం వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా క్రితం కురిసిన అకాల  వడగండ్ల వర్షానికి నేలమట్టం అయిన మొక్కజొన్న,మిర్చి,మామిడి,  వరి పంటలు వీణవంక  మండల వ్యాప్తంగా నేల రాలయని,రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని బిజెపి పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  బుధ వారం హిమ్మత్ నగర్ గ్రామంలో వారు  మాట్లాడుతూ వ్యవసాయ రైతులకు  చేతికొచ్చిన పంటలు అకాల వడగండ్ల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయని ,కొన్ని వేలల్లో పెట్టుబడి పెట్టిన రైతుకు  కనీసం పెట్టుబడి  కూడా వచ్చే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. వెంటనే  నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం మండల వ్యాప్తంగా వ్యవసాయ అధికారులకు గ్రామాలలో పంపించి నష్టపోయిన పంటలను అంచన వేసి వెంటనే ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు సుమారు 40 వేల నుండి 50 వేల రూపాయల వరకు  నష్ట పరిహారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి  రైతులకు ఆదుకోవాలని హుజురాబాద్  ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు వారి వెంట బిజెపి పార్టీ హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి. నాయకులు మోటం వెంకటేష్. పెద్ది మల్లారెడ్డి మాడ విజేందర్ రెడ్డి. తిరుపతి రెడ్డి వీరస్వామి  తోపాటు బిజెపి పార్టీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.