ఫొటో : అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
బెల్లంపల్లి, మార్చి 22, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం జనహిత అన్నపూర్ణ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన నియోజకవర్గ ప్రజలకి శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపి, ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని దానాల్లో కెల్ల అన్నదానం గొప్పదని, రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న జనహిత సేవా సమితికి అన్నదాన కార్యక్రమం నిర్వహణకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. అనంతరం జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ఉగాది సందర్బంగా 2021 ఏప్రిల్ 13న ప్రారంభిచామని, దాతల సహకారంతో ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు ఉగాది సందర్బంగా జనహిత ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు, 164వ సారి అన్నదానం దాతల చేత నిర్వహించమన్నారు. గత రెండేళ్లుగా జనహిత అన్నపూర్ణ ఆధ్వర్యంలో సుమారు 10 లక్షలకు పైగా ఖర్చుతో 164 సార్లు అన్నదానం చేపట్టి వేలాది మంది ఆకలి తీర్చడం ఆనందంగా ఉందన్నారు. అన్నదానం కోసం సహాయ సహకారాలు అందిస్తున్న అన్నదాతలు, శాశ్వత అన్నదాతలు, శ్రేయోభిలాషులు, సభ్యులు, మీడియా కు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్ గెల్లి రాజలింగు, వైస్ ఎంపీపీ రాణి – సురేష్, బీఆరెస్ నాయకుడు గడ్డం భీమా గౌడ్, జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్, కోశాధికారి కొడిపెల్లి గిరిప్రసాద్, ఉపాధ్యక్షురాలు హనుమండ్ల రమాదేవి, గౌరవ సలహాదారులు మురుకూరి బాలాజీ, సాంబారి నర్సయ్య, కందుల రాజన్న, పూదరి నగేష్ గౌడ్, సహాయ కార్యదర్శి పెద్ది వినయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు మోలుగురి వెంకటేష్, సింగతి తిరుమల్, కట్ట కిషన్, నిచ్చకోలా గురుస్వామి, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
జనహిత అన్నపూర్ణ ద్వితీయ వార్షికోత్సవం.




