Wednesday, 4 November 2026

వనపట్ల శోభకు దళితరత్న అవార్డు

 

 

 

 

 

 

 

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.నేరేడుచర్ల మండలం వైకుంటపురం గ్రామానికి చెందిన మాల మహానాడు సూర్యాపేట జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ వనపట్ల శోభ కు దళితరత్న అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ  వైస్ చైర్మన్ బోల్ మాల శ్యాం కుమార్, ఐఏఎస్ లోహితరాణ,మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి,రాష్ట్ర మహిళ అధ్యక్షులు గాజుల పున్నమ్మ,డాక్టర్ చిక్కుడు గుండాలు,రాష్ట్ర అధ్యక్షులు,చేతుల మీదుగా వన పట్ల శోభ కు, దళిత రత్న అవార్డు అందజేశారు.ఈ సందర్బంగా వనపట్ల శోభ మాట్లాడుతూ.నేను సమాజంలో దళితుల రాజ్యాధికారము కొరకు చైతన్య పరుస్తూనందుకు గుర్తించి నాకు అవార్డు ఇచ్చినందుకు కమిటీ సభ్యులకు మరియు కృషి చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.నాకు ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచినది అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఏనుముల రాజ్ కుమార్ జాతీయ అధికార ప్రతినిధి.గురు పాదం,విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సురేష్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ,సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కందుల వీరబాబు,నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు నాగటి జోసెఫ్,అంగరాజు స్వర్ణలత,నల్లగొండ జిల్లా మహిళా నాయకురాలు, దేవరకొండ డివిజన్ అధ్యక్షులు ఏకుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.