సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మంగళవారం యర్రమళ్ళ పురుషోత్తం రావు బ్రదర్స్ జ్ఞాపకార్థం శ్రీ రాఘవేంద్ర మొబైల్స్ ప్రోప్రైటర్ యర్రమళ్ళ ప్రసాద్ ఆధ్వర్యంలో బాటసారులకు మంచినీటితోపాటు మజ్జిగను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యర్రమళ్ళ ప్రసాద్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రమైన తర్వాత జిల్లా నలుమూలల నుండి ఎంతోమంది ప్రజలు తమ అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి వస్తున్నారని అన్నారు.ఎండలు విపరీతంగా ఉండటంతో బాటసారుల ఉపశమనానికి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం వేర్పాటు చేసి బాటసారుల దాహార్తిని తీర్చుతున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ నిర్వాహకులు ఇమ్మడి సందీప్, బెలిదే నాగేందర్, నోముల సంతోష్ , మిట్టకొల యుగేందర్, అజిత్ కుమార్ , గోలి ఆనంద్,రవి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.




