వనపర్తి(మమబూబ్‌నగర్): పెట్రోల్ ధర పెంపును నిరసిస్తూ వనపర్తిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తక్షణమే పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. తెదేపా నాయకులు ఎస్. అశోక్. రాములు యాదవ్, రమేష్‌గౌడ్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.




