కాశీబుగ్గ (వరంగల్): చలో అసెంబ్లీ సందర్భంగా తెలంగాణ వాదులను అణచివేసేందుకు ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చుచేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని తెరాస ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. హన్మకొండలోని అర్బన్ తెరాస కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావుతో కలిసి వినయ్‌భాస్కర్ విలేకరులతో మాట్లాడారు. 30వేల మంది పోలీసులతో అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా చలో అసెంబ్లీని విజయవంతం చేశారని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బంద్‌కు సహకరించిన తెలంగాణ వాదులకు ధన్యవాదులు తెలిపారు.




