వరంగల్‌ తులసిరెడ్డికి తెలంగాణ సెగ

వరంగల్‌, జనంసాక్షి: ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లులో సీమాంధ్రుకు చెందిన నేత 20 సూత్రాల పథకం అమలు కమిటీ ఛైర్మన్‌ తులసిరెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. కేయూ జర్నిలిస్టుల శిక్షణాకార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ జర్నలిస్టుల నుంచి తులసిరెడ్డికి నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణ జర్నలిస్టులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పని సీమాంధ్ర నేతలకు వేదికపై కూర్చునే అర్హతలేదని వెంటనే వేదిక దిగిపోవాలని హెచ్చరించారు. దీంతో వేదిక పై నుంచి దిగి వెళ్లిపోయారు.