వరంగల్ ఈస్ట్, జోన్ 24 (జనం సాక్షి) వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా రంగశాయిపేటకు చెందిన శేర్లఅనిల్ కుమార్ నియమితులైనారు. గత 25 సంవత్సరాలుగా రంగశాయి పేట గ్రామంలో అనిల్ కుమార్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ పాఠశాలను స్థాపించి నడుపుచున్నారు, అలాగే న్యాయవాది గా కూడా పనిచేస్తున్నారు. వరంగల్ జిల్లా యోగ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా బైరబోయిన కైలాస్ యాదవ్ మరియు జనరల్ సెక్రెటరీగా సోమరాజు నియమితులైనారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఆల్ ఇండియా జూడో ఫెడరేషన్ ట్రెజరర్ బైరబోయిన కైలాష్ యాదవ్ కి మరియు వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సోంరాజ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరిచారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ ఈ యొక్క ఆధునిక యుగంలో చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు కూడా యోగా అనేది అవసరం అని తెలియపరిచారు. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఏదో ఒక సమయంలో యోగా చేయడం వలన విద్యార్థి దశలో మానసిక పరికృషి అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యోగా అసోసియేషన్ అధ్యక్షునిగా నియమితులైనందుకు పలువురు అభినందించారు.
వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులుగా శేర్ల అనిల్ కుమార్




