హసన్ పర్తి,జనంసాక్షి,జూన్11:వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కేయూసీ సీఐ దయాకర్ ను సీపీ రంగనాథ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ భూ వివాదంలో కేసు నమోదు చేయకపోవడమే కాకుండా, బాధితులను పలుమార్లు స్టేషన్ చుట్టూ తిప్పించారనే కారణంతో సస్పెండ్ చేసినట్లు సమాచారం. బయటి వ్యక్తులతో కలిసి సీ.ఐ సెటిల్మెంట్ ప్రయత్నించారన్న ఆరోపణలతో సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో CI సస్పెండ్




