Thursday, 5 November 2026

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

 

 

 

 

 

 

బెల్లంపల్లి, మే 15, (జనంసాక్షి )బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, పరిసర ప్రాంతాల రైతులు ఈకొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, సర్పంచ్ అశోక్ గౌడ్, ఎంపీటీసీ సుభాష్ రావు, ఉప సర్పంచ్ చందు, బీఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్, మండల రైతు సమన్వయ సమితి డైరెక్టర్ సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇప్ప రవి, మాజీ సర్పంచ్ రఘు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.