నెన్నెల, మే 15, (జనంసాక్షి )క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం ఆయన నెన్నెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఖాళీ సమయంలో క్రీడలపై ద్రుష్టి పెట్టి క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల్లో రాణించడం వల్ల గ్రామానికి, మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. ఈ క్రీడా పోటిల్లో వాలీబాల్ లో చిత్తపూర్ జట్టు ప్రథమ స్థానం రాగా, నెన్నెల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. కబడ్డీ పురుషుల విభాగంలో గన్ పూర్ ప్రథమ, నెన్నెల ద్వితీయ స్థానంలో నిలిచింది. మహిళా విభాగంలో మైలారం ప్రథమ, నెన్నెల ద్వితీయ, ఫుట్బాల్ లో ఆవడం విజేతగా నిలిచింది. ఖోఖో మహిళా విభాగంలో నెన్నెల జట్టు ప్రథమ, మైలారం జట్టు ద్వితీయ, లాంగ్ జంప్ పురుషుల విభాగంలో ఆవడం విన్నర్, తండా రన్నర్, మహిళా విభాగంలో మైలారం జట్టు విన్నర్, రన్నర్ గా నిలిచాయి. విజేతలకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బహుమతులు అందజేసి ప్రశంసించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ సంతోషం రమాదేవి, జడ్పీటీసీ సింగతి శ్యామల, ఆర్డివో శ్యామల దేవి, తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీఓ వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్, ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, ఆత్మ చైర్మన్ సున్నం రాజు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్, సింగల్ విండో వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, బీఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు పంజాల విద్యా సాగర్ గౌడ్, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




