Tuesday, 3 November 2026

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తహసీల్దార్ పాండు నాయక్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తహసీల్దార్ పాండు నాయక్
తిరుమలగిరి (సాగర్) అక్టోబరు 29 (జనంసాక్షి) :
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో మండలంలో మూడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తాసిల్దార్ పాండు నాయక్ ప్రారంభించారు. శనివారం మండలంలోని రైతులకు అందుబాటులో ఉండే విధంగా తెట్టకుంట గ్రామానికి చెందిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అల్వాల ఎక్స్ రోడ్డు వద్ద, నేతాపురం గ్రామానికి చెందిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని డొక్కలబావి తండ వద్ద, కొంపెల్లి గ్రామాలలో ప్రారంభించారు.ఈ సందర్భంగా పాండు నాయక్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటను దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐకెపి కేంద్రాలలో విక్రయించాలని రైతులకు సూచించారు. ఈయన వెంట ఎంపీడీవో ఖాజ అస్గర్ అలి,ఏపిఎం లక్ష్మీనారాయణ,వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ రెడ్డి,ఎంపీటీసీ రామనర్సమ్మ,తెట్టకుంట సర్పంచ్ గుండెబోయిన లింగయ్య యాదవ్,నేతాపురం సర్పంచ్,బాసిరెడ్డి కుమారి వెంకటరెడ్డి,కొంపెల్లి ఉపసర్పంచ్ లింగాల మొగులయ్య,ఏఈఓ హేమలత,సుస్మిత ఐకెపి నిర్వాహకులు,సంఘ బంధం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.