వీణవంక ఏప్రిల్ 26 (జనం సాక్షి ) వీణవంక మండలంలోని చల్లూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో కోర్కల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ వాల బాలకిషన్ రావు.తో కలిసి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రైతులకు అండదండగా ఉంటున్నారు. ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాలలో రైతులు నేరుగా ప్రతి రైతు కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ఏ గ్రేడ్ 2060. బి గ్రేడ్2040 పొందాలని సూచించారు. ఇటీవల పడిన అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని రైతులు అధైర్య పడ వద్దని ఉన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి. గ్రామ సర్పంచులు పొదిల జ్యోతి రమేష్ . మర్రి వరలక్ష్మి స్వామి. మాజీ సింగిల్ విండో చైర్మన్ మాడ సాధవ రెడ్డి . ఎంపీటీసీ నాగిడి సంజీవరెడ్డి. చదువు నరసింహారెడ్డి. ఎలవేణి సవిత మల్లయ్య. సంఘ స్వరూప సమ్మయ్య సింగిల్ విండో డైరెక్టర్లు. మధుసూదన్ రెడ్డి. ముదుగంటి శ్యాంసుందర్ రెడ్డి. చెక్క బండ శ్రీనివాస్ రెడ్డి. సి ఓ ప్రకాష్ రెడ్డి . ఐకెపి ఏపీఎం కొమురయ్య గను శ్యామ్ తో పాట సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు




