Wednesday, 4 November 2026

నృసింహనవరాత్రోత్సవములు వైభవముగా ప్రారంభమయినవి

 

 

 

 

 

 

 

 

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారి దేవస్థానము, ధర్మపురిలో బుధవారం నుండి నృసింహనవరాత్రోత్సవములు వైభవముగా ప్రారంభమయినవి. e ఉత్సవములలో భాగంగా బుధవారం ఉదయము 5.30 గంటలకు అన్ని దేవాలయముల అర్చకులు మంగళ వాయిద్యములోతో గోదావరి నదికి వెళ్ళి గోదావరిలో పూజలు నిర్వహించి, బిందె తీర్థము తెచ్చినారు. తర్వాత ఉదయము 6.30 గంటలకు స్వస్తి వుణఃహవచనము, ఋత్వికరణము, కలశ స్థాపన, శ్రీస్వామి వారికి పంచోపనిషత్తులతో అభిషేకము, ప్రత్యేక పూజలు నిర్వహించబడినవి. మరియు సాయంత్రం 5.00 గంటలకు వేదోక్తముగా సహాస్ర కలశస్థాపన, నవగ్రహ, యోగినివాస్తు, క్షేత్రపాలక స్థావనలు, అర్చనాది ఆరాధన, నిత్య హోమము, నిత్య కళ్యాణము తదితర కార్యక్రమములు జరిగినవి.ఈ కార్యక్రమములో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనోవేషన్ కమిటీ చైర్మెన్ ఇందారపు రామన్న మరియు కమిటీ సభ్యులు గందె పద్మ శ్రీనివాస్, అక్కనపల్లి సురేందర్, వీరవేణి కొమురయ్య, చుక్క రవి, స్తంభంకాడి మహేష్, ఇనగంటి రమా వెంకటేశ్వరరావు, గునిశెట్టి రవీందర్ , పల్లెర్ల సురేంధర్, గుంపుల రమేష్, వేముల నరేష్, జైన రాజమౌళి సంగెం సురేష్  మరియు డి.సి.ఎం.ఎస్ ఛైర్మన్  ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ సంగి. సత్తమ్మ స్థానిక కోర్టు న్యాయమూర్తి శ్యాం ప్రసాద్ మాజీ జెడ్.పి. ఛైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ మరియు ఉప ప్రధాన అర్చకులు నేరళ్ళ శ్రీనివాసాచారి, ముఖ్య అర్చకులు  నంబి శ్రీనివాసా చారి & సిహెచ్. రమణయ్య మరియు దేవస్థాన సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అర్చకులు బొజ్జ, సంతోష్ కుమార్, బొజ్జ సంపత్ కుమార్, బొజ్జ. రాజగోపాల్ శర్మ గార్లు మరియు స్థానిక పండితులు  పాలెపు చంద్రమౌళి, శ్రీ కొరిడే విశ్వనాథం శర్మ తదితర అర్చక సిబ్బంది పాల్గొన్నారు.