Thursday, 5 November 2026

వర్షానికి నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఇవ్వలి

 

కాంగ్రెస్ నాయకుడు ఎండి సాహెబ్ హుస్సేన్

వీణవంక మార్చి 17 (జనం సాక్షి ) వీణవంక నిన్న కురిసిన వడగండ్ల వర్షానికి వీణవంక మండలంలోని ఆయా గ్రామాలలో రైతుల మొక్కజొన్న మరియు వరి పంటలు దెబ్బతిన్నాయని మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ అన్నారు. రైతులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ హాయంలో పంట నష్టం జరిగిన సందర్భాల్లో రైతులకు పరిహారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నదని గుర్తు చేశారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే స్పందించి వ్యవసాయ అధికారుల ద్వార పంట నష్టం అంచనాలు వేసి , రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు.