ముఖ్యఅతిథిగా హాజరైన డిస్టిక్ గవర్నర్ 320 జి లయన్ రిక్కల నారాయణరెడ్డి
మెట్ పల్లి టౌన్, మార్చి 17,
జనంసాక్షి :
మెట్ పల్లి పట్టణంలోని మహాజన్ గార్డెన్ లో లయన్స్ క్లబ్ ముఖ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్టిక్ గవర్నర్ లయన్ 320 జి రిక్కల నారాయణరెడ్డి హాజరైనారు. పలు ముఖ్య కార్యక్రమాల గురించి పరిశీలన కోసం ప్రత్యేకంగా రీక్కలనారాయణరెడ్డి మెట్పల్లి లయన్స్ క్లబ్ సమావేశానికి హాజరయ్యారు.లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు కార్యవర్గం ద్వారా లయన్స్ క్లబ్ తరపున జరిగిన వివిధ సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు .
ఈ కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్ రిక్కల నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొదటి స్తానంలో ఉన్న మెట్టుపల్లి లయన్స్ క్లబ్ రాష్ట్రంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడం గొప్ప విషయమని అన్నారు లయన్స్ క్లబ్ సేవ కార్యక్రమాలు చాలావరకు పేదలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేస్తున్నారని అందుకే రాష్ట్రస్థాయిలో మెట్పల్లి క్లబ్ కు ప్రత్యేకంగా గుర్తింపు వచ్చిందని అలాగే ఇకముందు కూడా చేసే సేవా కార్యక్రమాల వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగిందని, లయన్స్ క్లబ్ సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేయడానికి కోసమే ఈ లయన్స్ క్లబ్ లో సభ్యత్వం తీసుకుంటారని మానవసేవయే మాధవ సేవ అన్న విధంగా లయన్స్ క్లబ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ సేవలో ముందు ఉంటారని అన్నారు.
ఆనంతరం ఆయనకు ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కట్కం రాకేష్ ,సెక్రెటరీ ఇల్లందుల శ్రీనివాస్, కోశాధికారి ఇందూరు రాకేష్ ,ఆర్ సి ఉష కిరణ్ ,జెడ్ సి కోట గంగజీవన్, నారాయణరెడ్డి, మహాజన్ నరసింహులు ,వడ్డేపల్లి శ్రీనివాస్ ,ప్రోహర్ తుకారాం, గంగుల మురళీ,మహాజన్ శివకుమార్ ,నర్సింగరావు పవను, బొమ్మల శంకర్, మృత్యుంజయ్ , చంద్రశేఖర్, దయాకర్ ,వెంకటేష్, తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు
మెట్ పల్లి లయన్స్ క్లబ్ సమావేశం




