వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలుల పెరిగాయన్న ఎమ్మెల్యే
నిజామాబాద్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని  ఆర్మూర్‌ ఎమ్మెల్య జీవన్‌ రెడ్డి  అన్నారు. అలాగే భూగర్భ జలాలలు పెరుగుతున్నాయని అన్నారు. కాళేశ్వరం పనులకు కొంత ఆటంకం ఏర్పడిరదన్నారు.  తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల ఏర్పాటుతో కరువు ప్రాంతాల్లోని భూములు బంగారు మాగాణులుగా మారుతాయన్నారు. కరువు ప్రాంతాలను కూడా బంగారు మాగాణులుగా తీర్చిదిద్దుతామన్న పట్టదలతో కెసిఆర్‌ ఉన్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుక బాటుకు గురైన తెలంగాణలో రైతాంగం బాగుండి, రాష్ట్రమంతా సస్యశ్యామలంతో ఉండాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.  కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రాజెక్టులు కడితే దశాబ్దాల పాటు సాగేవని… తెలంగాణ ప్రభుత్వం అలా కాదని, నాలుగు సంవత్సరాల్లో ప్రాజెక్టులు పూర్తిచేసి సాగు, తాగు నీరు అందజేసేందుకు కృషిచేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు పోచంపాడ్‌ ప్రాజెక్టును కట్టేందుకు 37 సంవత్సరాల సమయం తీసుకున్నారని, ఇప్పడు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి మూడున్నర సంవత్సరాలు కావస్తుందని, మరో ఆరు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని వెల్లడిరచారు. వచ్చే సంవత్సరం నుంచి సాగు నీరు అందజేస్తామని, వర్షాలు కురవకున్నా సాగుకు ఢోకా లేదన్నారు. కాళేశ్వరం ద్వారా రాష్ట్రంలో మొత్తం 37 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుం దన్నారు. రాష్ట్రంలోని రైతాంగ సంక్షేమానికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విమర్శించడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని కాలం వెల్లదీశారని, స్వరాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంత ఖర్చయినా పూర్తి చేసేందుకు వెనుకాడడం లేదన్నారు.
““““`

తాజావార్తలు