హైదరాబాద్:సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని డైరీఫాం రోడ్డులో వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి కుమార్ అనే వ్యక్తిపైకి దూసుకుపోయింది. ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరగగానే వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




