Tuesday, 3 November 2026

వాతావరణ మార్పులపై వ్యాసరచన పరీక్ష

వాతావరణ మార్పులపై వ్యాసరచన పరీక్ష

డోర్నకల్ అక్టోబర్ 29 జనం సాక్షి

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కస్తూర్బా పాఠశాలలో శనివారం చిల్డ్రన్ మూమెంట్ ఫర్ క్లైమేట్ జస్టిస్,బంజర సేవా సమితి ఆధ్వర్యంలో వాతావరణంలో మార్పులు పై విద్యార్థినిలకు వ్యాసరచన పోటీ నిర్వహించినట్లు సంస్థ నేషనల్ కోఆర్డినేటర్ థామస్ తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని,పర్యావరణ అంశాల పట్ల బాధ్యతాయుతంగా ఉండేవిధంగా,విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు.దీంట్లో విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచి జీవవైవిధ్యాన్ని కొనసాగించే విధంగా పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వ్యాసరచన పోటీలో వివరించారు.ప్రధానంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం,చెట్ల పెంపకం,నీటిని సద్వినియోగం చేసుకోవడం,లాంటి అంశాల పట్ల విద్యార్థులు దృష్టి సారించినట్లు తెలిపారు.అనంతరం ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్థానిక సీఐ వెంకటరత్నం ప్రశంస పత్రాలను అందజేశారు.భావితరాలకు దిక్సూచి యువతే అని అన్నారు.ప్లాస్టిక్ నిర్మూలించి మొక్కలు నాటి ఆరోగ్య తెలంగాణలో భాగస్వాములు కావాలన్నారు.కార్యక్రమంలో కమిటీ వీరేందర్ స్టేట్ కోఆర్డినేటర్ కుమార్ బానోత్,ప్రిన్సిపల్ మున్ని,అధ్యాపకులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.