వాన్‌ `ఇఫ్రా అధ్యక్షుడిగా బ్రునెగార్డ్‌

బ్యాంకాక్‌ : స్వీడస్‌కి చెందిన స్టాంపెస్‌ మీడియా గ్రూప్‌ ఛైర్మన్‌ తోమస్‌ బ్రునెగార్డ్‌ వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌ అండ్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ (వాన్‌`ఇఫ్రా)కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న వార్షిక సమావేశాల్లో ఆయనను ఆధ్యక్షునిగా ఎన్నుకున్నారు. తోమన్‌ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. మళయాళ మనోరమ సంస్థకు చెందిన జాకోబ్‌ మ్యాథ్యూ ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా ఉండేవారు.