వాలీబాల్ పోటీలను ప్రారంభించిన జడ్పిటిసి మంద భార్గవి కోటీశ్వర్ రెడ్డి
గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (14): మండల పరిధిలోని ఏదుల గ్రామంలో మాజీ సర్పంచ్ ఎద్దుల గోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎద్దుల శ్రీనివాస్ రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామం లో వాలీబాల్ పోటీలను నిర్వహించారు ఈ వాలీబాల్ పోటీలను శనివారం మండల జడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్న ఎద్దుల శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు వాలీబాల్ పోటీలు ద్వారా యువకులు మంచి ఫిట్నెస్ సాధించడానికి ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గాజుల కోదండం రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు తిరుపతయ్య యాదవ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ గువ్వల రాములు, ఏదుల గ్రామ సర్పంచ్ నాగమణి వెంకటయ్య, ఎంపీటీసీ నరేందర్, టిఆర్ఎస్ మండల నాయకులు మహేష్,




