Thursday, 5 November 2026

మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

విజేతలకు బహుమతులు అందజేసిన నగుబోతు రవీందర్

వేములవాడ జనవరి 14 (జనంసాక్షి)
సంక్రాంతి,భోగి పండగలు పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రోజున మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు,ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు వేసిన ముగ్గులు పరిశీలించి విజేతలను ఎంపిక చేసారు,ఈ పోటీలో 68 మహిళలు పాల్గొనగా ప్రథమ బహుమతి మామిడ్ల మానస నగదు 2500,ద్వితీయ బహుమతి మారం స్వప్న నగదు 1500,తృతీయ బహుమతి రుద్ర రవళి నగదు 1000,గెలుచుకున్నరు అదేవిదంగా కన్సోలేషన్ బహుమతులు 10 మంది మహిళలకు అందజేయడం జరిగిందిని, బహుమతులకు సహకరించిన దాల్మియా సిమెంట్, స్నేహా మార్కెటింగ్ డీలర్ భాను ఏజన్సీస్ నగుబోతు రవీందర్ కు మై వేములవాడ ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు,ఈ సందర్భంగా మధు మహేష్,నగుబోతు రవీందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించామని,ఎంతో ఉత్సాహంగా మహిళలు పాల్గొన్నారని అన్నారు,ఈ కార్యక్రమంలో గొంగళ్ళ రవికుమార్,తాళ్లపల్లి ప్రశాంత్, బస్మాంగి బసవరాజ్,నాగుల చంద్రశేఖర్, ప్రతాప నటరాజ్, జూలపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.