హైదరాబాద్: ఆలిండియా ఆర్పీఎఫ్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో సదరన్ రైల్వే ఆర్పీఎఫ్ జట్టు టైటిల్‌ను దక్కించుకుంది. సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో 25-15, 25-22, 25-22తో ఈస్ట్ కోస్ట్ రైల్వే జట్టుపై విజయం సాధించింది.మొత్తం 17 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఈస్ట్రన్ రైల్వే మూడో స్థానంలో, దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) నాలుగో స్థానంలో నిలిచాయి. పోటీల అనంతరం ఎస్‌సీఆర్ అడిషనల్ జనరల్ మేనేజర్ ఏకే గుప్తా విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేశారు.




