బాల్ టోర్నమెంట్ విజేత మాదాపూర్ జట్టు
దండేపల్లి. జనంసాక్షి.18 .జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా బిజెపి యువ మోర్చ ఆధ్వర్యంలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ సహకారంతో దండేపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో ఈనెల 15 న ప్రారంభం అయిన జిల్లా స్థాయి వాలీ బాల్ పోటీలుకు బుధవారం. నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ లో మాదాపూర్ జట్టు మరియు దండేపల్లి జట్టు మధ్య జరిగింది. ఈ ఫైనల్ లో మాదాపూర్. జట్టు విజేతగా నిలిచింది. గెలుపొందిన జట్టు బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రావు 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్, ట్రోఫీ అందించడం జరిగింది. రన్నర్ గా నిలిచిన దండేపల్లి జట్టుకు 5000 రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు రన్నర్ ట్రోఫీ అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గాదె శ్రీనివాస్, ముస్కే కార్తిక్, పట్టి వెంకట కృష్ణ, తల్లపళ్లి వంశీ సిపిరిషెట్టి శ్రీనివాస్, కర్నల కిషన్, బత్తుల శేఖర్, బీడీలు మల్లేష్, బొడ సత్యనారాయణ, బోర్లకుంట వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
వాలీ బాల్ టోర్నమెంట్ విజేత మాదాపూర్ జట్టువాలీ




