Thursday, 5 November 2026

వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ సంబరాలు

వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ సంబరాలు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): శుక్రవారం విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ సంబరాలను మెగాస్టార్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఈశ్వర్ మూవీ మాక్స్ లో మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం జిల్లా నాయకులు శనగాని రాంబాబు గౌడ్ కేక్ కట్ చేసి మాట్లాడారు.వాల్తేరు వీరయ్య సినిమా వంద రోజులు ఆడాలని ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరూ సినిమాను థియేటర్ లో మాత్రమే చూడాలని కోరారు. చిరంజీవి అభిమాన సంఘం నాయకులంతా మరింత సక్సెస్ ను చేకూరాలని కోరుకున్నారు.వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన అప్పం శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారుఈ కార్యక్రమంలో సాజిద్ ఖాన్ , మసూద్ , అఖిల్ , సందీప్ , శంకర్ , బిక్షపతి , సమ్మి తదితరులు పాల్గొన్నారు.