Thursday, 5 November 2026

పి ఓ డబ్ల్యు రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయండి

పి ఓ డబ్ల్యు రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయండి

టేకులపల్లి,జనవరి 13( జనం సాక్షి): ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం టేకులపల్లి మండల కేంద్రంలో మహాసభల పోస్టర్ ను పి ఓ డబ్ల్యు మండల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్ష,కార్యదర్శులు భూక్య చిన్ని, నోముల కళావతి, టేకులపల్లి గ్రామ పంచాయతీ 3వ వార్డు సభ్యులు మండల నాయకురాలు తొటకూరి చిట్టమ్మ మాట్లాడుతూ జనవరి 28,29, తేదీల్లో మహబూబాబాద్ పట్టణంలో రెండు రోజులు పాటు జరిగే రాష్ట్ర మహాసభలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, రాజేశ్వరి, కమల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.