భువనగిరి. (జనం సాక్షి):–
వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యములో ఉగాది పండగ ను పురస్కరించుకొని ముద్రించిన శోభకృత నామ సంవత్సర పంచాంగమును వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కార్యదర్శి ఇరుకుల్ల రామకృష్ణ ఆవిష్కరించారు. అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ నరేంద్ర శర్మ గారిచే పంచాంగ శ్రవణం అయ్యప్ప దేవాలయ గోశాల నందు గోపూజ మరియు గోగ్రాస వితరణ ఉచితముగా పంచాంగములు అందించడం జరిగింది ఈ కార్యక్రమములో క్లబ్ అధ్యక్షులు తాటిపల్లి రవీందర్ ప్రధాన కార్యదర్శి సుగ్గుల చంద్రశేఖర్ కోశాధికారి మితింటి భాస్కర్ జిల్లా అయ్యప్ప దేవాలయ అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు క్యాబినెట్ అదనపు కోశాధికారి పోకల సోమన్న జోన్ చైర్మన్ మంచాల ప్రభాకర్ సభ్యులు సోమ బనారస్ ,ముక్కా శ్రీనివాస్ ,గుడాల శ్రీనివాస్ ,పాలకుర్తి వేణు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగం ..




