మిర్యాలగూడ, జనం సాక్షి.నిరుపేద ఆర్యవైశ్య మహిళలను ఆదరించడం గొప్ప విషయం అని వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ రాయపూడి భవాని అన్నారు. సోమవారం స్థానిక వాసవి భవన్లో ఏర్పాటుచేసిన వాసవీ అలంబన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నిరుపేదలను ఆర్థికంగా ఆదుకునే గొప్ప కార్యక్రమం అని అభినందించారు. మిర్యాలగూడ వాసవి క్లబ్ వనిత, కుసుమంబ క్లబ్ ల ఆర్థిక సహకారంతో ఎంపిక చేసిన 30 మంది ఆర్యవైశ్య నిరుపేద మహిళలకు ఒక సంవత్సరం పాటు పింఛన్ అందించే కార్యక్రమం లో పింఛన్లు పంపిణీ చేశారు. వాసవి క్లబ్ రీజియన్ సెక్రటరీ తిరునగరు పద్మావతి. రీజియన్ ఎక్స్టెన్షన్ చైర్మన్ వీరవల్లి పద్మావతి, జోనల్ చైర్మన్ భువనగిరి లావణ్య, పింఛన్ దాతలు తినుగర్ రోజా రాణి, కొండూరు ఇందిర ల చేతుల మీదుగా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వనిత క్లబ్ అధ్యక్షురాలు కొప్పురావూరి రమాదేవి, కార్యదర్శి గుండా లక్ష్మి, వాసవి వనిత కుసుమాంబ కోశాధికారి గౌరులత తదితరులు పాల్గొన్నారు.




