మిర్యాలగూడ, జనం సాక్షి నేరాల నియంత్రణ కోసం సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటగిరి అన్నారు. సోమవారం డిఎస్పీ కార్యాలయంలో మిర్యాలగూడ ఐ ఎం ఏ అధ్యక్షులు డాక్టర్ మాధవ కుమార్. డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ అంజయ్య, డాక్టర్ మనోహర్, డాక్టర్ వెంకట్ రెడ్డి డాక్టర్ కిషోర్లతో కలసి డిఎస్పి వెంకటగిరి కు ఒక లక్ష రూపాయల చెక్కును అందజేశారు. అదేవిధంగా మిర్యాలగూడ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ నాయకులు జిల్లా అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు, ముక్క రామ్మూర్తి వేంపాటి శ్రీనివాస్ ఆలంపల్లి శ్రీనివాస్, అశోక్ రెడ్డి తదితరులతో కలిసి డిఎస్పి వెంకటగిరికు రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.సిసి కెమెరాల ఏర్పాటు సహకరిస్తూ మిర్యాలగూడ పట్టణంలోని వ్యాపార సముదాయాలు, రహదారి కూడలిలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసేలా వ్యాపార, వాణిజ్య అసోసియేషన్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని డి.ఎస్.పి కోరారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ రాఘవేందర్ ఉన్నారు.




