Monday, 2 November 2026

విఆర్ఏ లు 9 వ రొజు నిరవధిక సమ్మె

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 2 రాయికోడ్ మండలం తహశీల్దార్ కార్యాలయం ముందు

మండల గ్రామ సేవకులు 9 వ రొజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు మంగళవారం నాడు
రాయికోడ్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు
 9 రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. విఆర్ఏ లకు పేస్కెల్ జీవో ను వెంటనే విడుదల చేయాలి.
అర్వత కలిగిన విఆర్ఏ లకు ప్రమోషన్స్ కల్పించాలి. 55 సంవత్సరములు నిండిన విఆర్ఏ ల స్థానంలో వారసులకు ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్బంగా వ్యక్తపరుస్తూ వారి ప్రధాన డిమాండ్లను(ముఖ్యమంత్రి గారి హామీ లు) అమలుచేయాలని సీఎం కెసిఆర్ ను కోరారు . ఈ కార్యక్రమంలో. మండల అధ్యక్షులు జి పి రత్నం ఉపాధ్యక్షులు శివకుమార్
కార్యదర్శి శ్రీశేలం కొశదికారి. లక్ష్మి వీరేందర్ అశోక్ విఠల్ విజయాలక్ష్మి భాగ్యవతి సుజాత లక్ష్మి ధుర్గన్నా ఇస్మాయిలు నర్సింలు దన్ రాజు తదితరులు పాల్గొన్నారు