Wednesday, 4 November 2026

విఓల విధుల ఏంటి , వారి సమ్మెకు ఎందుకు ప్రతిపక్షల మద్దతు

 

రుద్రుర్(జనంసాక్షి):విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఉద్యోగులు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమైన విధులు కొత్త సంఘాలు ఏర్పాటు చేయడం, వికలాంగుల సంఘము ఏర్పాటు చేయడం, గ్రామ సంఘము సమావేశాలు ఏర్పాటు చేయడం, గ్రామ సంఘము 12 రకాల పుస్తకాలు రాయడం, సంఘ సభ్యురాలుకు అన్ని రకాల లోన్స్ ఇప్పించడం, బ్యాంకు లోన్స్ ఇప్పించడం, స్త్రీ నిధి లోన్స్ ఇప్పించడం, వివో అప్పు ఇప్పించడం, ఎమ్మెస్ సీఐఎఫ్ అప్పు ఇప్పించడం, ఎస్సీ ఎస్పీ లోన్స్ ఇప్పించడం, పిఓపి ఉన్నతి, హెచ్ఎల్ లోన్స్ ఇప్పించడం, డైరీ లోన్స్ ఇప్పించడం, అన్ని రకాల లోన్స్ రిక్వైరీ చేయడం, వివో ఎస్ హెచ్ జి మెంబర్స్ ప్రొఫైల్ డేటా ఎంట్రీ చేయడం, సభ్యురాలు ఎకౌంటు మరియు ఆధార్ కార్డు సరి చేయించడం, సభ్యురాలి ఫోటోలు మరియు పేర్లు సవరించుట చేయడం, సభ్యురాలి పేరు తెలుగులోకి మార్చుట, ఎస్ హెచ్ జి అకౌంటింగ్ లో అన్ని రకాల డేటా ఎంట్రీ చేయడం, ఎన్ పి ఎం సేంద్రీయ సుస్థిర వ్యవసాయము గురించి తెలుపుట, న్యూట్రి గార్డెన్, ఎఫ్ పి జి గ్రూప్స్ ఏర్పాటు చేయడం, స్త్రీ నిధి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం, స్త్రీ నిధి సురక్ష బి చేయించడం, ఎడ్.డి.ఎఫ్ ఫండ్ సేకరణ, జాతీయ గ్రామీణ జీవనోపాదులు, ఆరోగ్య పోషణ సమావేశాలు ఏర్పాటు చేయడం, మార్కెటింగ్, నిరుద్యోగులను గుర్తించడం మరియు జాబ్ మేళాకు పంపించడం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం, న్యూ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయడం, చిన్న సంఘాల లైవ్ మీటింగ్ పెట్టడం, చిన్న సంఘాల ఆడిట్ కొరకు కట్ ఆఫ్ షీట్స్ రాయడం, ఎన్ ఆర్ ఎల్ ఎం కటాఫ్ సీట్స్ రాయడం మరియు ఎంట్రీ చేయడం, వివో ఆడిట్ చేయడం, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం మరియు మోటివేషన్ చేయడం, పల్లె ప్రగతి, హరితహారం, గ్రామసభలలో పాల్గొనడం, డ్రాప్ అవుట్ సర్వే
చేసి పిల్లలను గుర్తించి బడికి పంపించడం, ప్రభుత్వ పాఠశాలలో మీడ్ డే మిల్స్ ను చేసేవారిని గుర్తించడం, స్వచ్ఛభారత్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, సదరం క్యాంపుకు పంపించడం, ప్రధానమంత్రి జీవనజ్యోతి మరియు ప్రభుత్వ ఇన్సూరెన్స్ లు కట్టించడం, బతకమ్మ చీరల పంపిణీ చేయడం, ఓటరు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, ఎలక్షన్ డ్యూటీ నిర్వహించడం ఇలా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పనిచేస్తూ 50 రకాలకు పైగా పనులను నిర్వహిస్తున్నరు ఇన్ని రకాలుగా వారు సేవలు అందిస్తున్న వారికి ఇచ్చే వేతనాలు అరకోర మాత్రమే,
వీరి సమ్మెకు ప్రతిపక్షలు మద్దతు ఇవ్వటం వలన
ప్రజల్లో అనేక రకాలుగా సత్ సంబంధాలు ఉన్న విఓలు వలన ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అవకాశలు లేకపోలేదు ఐతే వీరి డిమాండ్లను ప్రభుత్వం ఎలా చూస్తుందో వేచి చూడాలి