శామీర్ పేట్, జనంసాక్షి : మండల కేంద్రం శామీర్ పేట్ గ్రామంలోని కట్ట మైసమ్మ ఆలయ జాతర సందర్బంగా కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మంత్రి తో పాటు సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డి,బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు సుదర్శన్, ఎంపీపీ ఎల్లు భాయి బాబు, వైస్ ఎంపీపీ సుజాత, చాంద్ పాషా, శ్రీకాంత్ రెడ్డి,ఉప సర్పంచ్ రమేష్ లు మంత్రి కి స్వాగతం పలికారు.
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హరివర్ధన్ రెడ్డి, జంగయ్య యాదవ్ ల వెంబడి వై ఎస్ గౌడ్, మహేందర్ యాదవ్, ముజీబ్ లు జాతరలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.నాయకులకు ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణ, కోశాధికారి సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ వంగ వెంకట్ రెడ్డీలతో పాటు సభ్యులు శాలువాలు కప్పి మేమేంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సాయి గౌడ్, విష్ణు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
8ఎస్పీటీ -1: జాతరలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
కట్టమైసమ్మ జాతరలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి




