వికలాంగుల సంక్షేమమే- తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం
*ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 15,
జనం సాక్షి :
మెట్ పల్లి పట్టణంలోని మహాజన్ గార్డెన్స్ లో జరిగిన వికలాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఇట్టి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 3,016 రూపాయలు పింఛన్ దేశంలోనే ఎక్కడ లేదని, ఎకనామిక్ రిహాబీటిషన్ స్కీమ్ క్రింద లోన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలియజేసారు. ఉపకరణాల పంపిణీ (స్కూటీలు, బ్యాటరీ సైకిల్ ) పథకం ద్వారా చాలా మంది వికలాంగులకు అందజేసామని, సకలాంగులు వికలాంగులను పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి తోపాటు 1,25,000 రూపాయల రివార్డ్ అందచేస్తున్నామని తెలిపారు. బస్సు పాసుల రాయితీ ( సగం ధర టికెట్లు) మరియు బీసీ,ఎస్సీ స్టడీ సర్కిల్స్ లో వికలాంగులకు ఉచిత కోచింగ్ ముఖ్యమంత్రి కెసిఆర్ అందజేస్తున్నారని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి మనందరి సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారుసాయిరెడ్డి, అధికారులు ప్రజా ప్రతినిధులు , వికలాంగులు పాల్గొన్నారు
వికలాంగుల సంక్షేమమే- తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం




