జిల్లాలో జోరుగా రేషన్ దందా.
ఆదిలాబాద్ జనంసాక్షి.
ఒకటో తారీఖు వచ్చింది అంటే చాలు రేషన్ మాఫియా జిల్లాలో తిష్ట వేస్తుంది. సామాన్య ప్రజల నుండి తక్కువ ధరలో రేషన్ బియ్యం కొని మహారాష్ట్రకు తరలిస్తూ లక్షల రూపాయలు ప్రభుత్వ అదయానికి గండి కొడుతున్నారు.జిల్లా కేంద్రం లో తాంసీ బస్టాండ్ మీపంలో లో ఉన్న స్వస్తిక్ జీన్నింగ్ లో భారీగా రేషన్ బియ్యం ఉన్నట్లు విశ్వసనియా సమాచారం.ఉదయం నుండి ఆటోలలో తరలించి అటునుండి మహారాష్ట్ర కు తరలిస్తారు. జిల్లా కేంద్రానికి నడి ఒడ్డున ఇంత జరుగుతున్న స్థానిక పోలీస్ లు కానీ సంబంధిత షాక అధికారులు స్పందించక పోవడం పలు విమర్శలకు తవిస్తుంది.ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.




