వికలాంగ బాలికపై అత్యాచారం

మెదక్ : అంతర్జాతీయ బాలికల సంరక్షణ దినోత్సవం రోజునే…. ఓ వికలాంగ బాలికపై అత్యాచారం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి పదేళ్ల వికలాంగ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బయ్యారం గ్రామంలో నర్సింహులు అనే వ్యక్తి అదే గ్రామంలో వికలాంగురాలైన పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా… వికలాంగ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.