Wednesday, 4 November 2026

విద్యార్ధినులను చితకబాదిన టీచర్

తూర్పుగోదావరి : విద్యార్ధినులను చితకబాదిన టీచర్ ఉదంతం ఆదివారం వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోగల ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులను టీచర్ చితకబాదింది. విషయం తెలుసుకున్న స్థానిక పత్రికా విలేకరులు హాస్టల్‌కు వెళ్లగా హాస్టల్ సిబ్బందితోపాటు పోలీసులు విలేకరులను అడ్డుకున్నారు. కాగా… విద్యార్థినులను చితకబాదిన టీచర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *