స్థానిక కౌన్సిలర్ లేకుండానే వాటిలలో ఎలా తిరుగుతారని మీతోనేను కార్యక్రమం ప్రజలకు ఓరిగేది ఏమీ లేదని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి ఆరోపించారు శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని 34 వ వార్డు లో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకు మునుపు నిర్వహించిన మీతోనేను కార్యక్రమల్లో ప్రజల ఇచ్చిన హామీలు ఏమయ్యాయిపోలీస్లను వాడుకొని రాజకీయం చేస్తున్న తీరు మార్చుకోండిపోలీస్ అధికారులు ఎమ్మెల్యే కు వత్తసు పలుకుతున్నారుశాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకూడా మాకు లేదాప్రజా సంక్షేమంకోసం, వార్డ్ అభివృద్ధి కోసం ప్రాణం ఉన్నంతవరకు పోరాటం చేస్తాం.ఇంతకు మునుపు పాలకవర్గంలోని చివరి సమావేశన్ని అపి అభివృద్ధి ఆటంకం కలిగించింది ఎవరు.డైట్ కాలేజీ లో మీరు ఇచ్చిన హామీలు ఏమైయాయి.మున్సిపల్ లో చైర్మన్ల పంచాయతీ పెట్టి తెరవెనుక రాజకీయం చేసినది ఎవరు.సమస్యలు సృష్టించి.. మళ్ళీ ఆ సమస్యలు మిరే పరిష్కారిస్తామనండం హాస్యాస్పదం ఎమ్మెల్యే పదవి చేపట్టి ఇప్పటివరకు 4 సంవత్సరాల 6 నెలలు ఐతుంది.. ఎం అభివృద్ధి చేసినవ్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు చేసిన అవినీతి కి జైలుకి వెళ్లక తప్పదు..మున్సిపల్ అభివృద్ధికి నిధులు తీస్కొని రండిబి ఆర్ ఎస్ కౌన్సిలర్లు కండ్లు ఉండి చూడలేని గుడ్డివారీగా తయారైనారు.
యు జి డి పాడై పోయి ఎన్ని రోజులు ఐతుంది.. పట్టించుకునే నాధుడు లేడు..రాబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు సరైన బుద్ది చెప్తారు..అభివృద్ధిని అడ్డుకుంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం ఖబర్దార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ కోటిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు వహీద్ మి యా మండల కో ఆప్షన్ సభ్యులు ఎర్రవల్లి జాఫర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు




