టేకులపల్లి, జూలై 7( జనం సాక్షి ): 2015 లో బీ సీ కార్పొేషన్ నుండి చేతి వృత్తి దారులకు రుణాలను మంజూరు చేశారని, ఇట్టి రుణాల్లో 2017లో టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి నాపై తప్పుడు కేసును పెట్టీ వేధించారని, దీంతో ఏడేళ్లుగా కోర్టు వాయిదాలకు తిరుగుతూ మనోవేదనకు గురవుతూ ఆర్థికంగా నష్టపోయానని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు తౌడోజు బిక్షమయ్య వివరించారు. ఈ సందర్భంగా టేకులపల్లి మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2015 బీసీ కార్పొరేషన్ నుంచి మంజూరైన రుణాలకు నాకు ఎటువంటి సంబంధం లేదని, ఇట్టి రుణాలలో అవకతవకలు జరిగినట్లు బీసీ కార్పొరేషన్ నుంచి పోతులూరి సొసైటీ ద్వారా మంజూరైన రుణాలలో సభ్యులుగా ఉన్న కాగితాల నాగభూషణం, గద్దోజు రమేష్, కైరోజు వెంకటరమణచారి, ఆకారపు వెంకటాచారిలు కలిసి బీసీ కార్పొరేషన్ రుణాల్లో అవకతవకలు జరిగినట్లు నాపై, బయ్యారం జలేంద్రాచారిపై టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు నమోదు చేశారని అన్నారు. ఈ రుణాలకు నాకు ఎటువంటి సంబంధం లేదని, తప్పుడు కేసు పెట్టి ఏడు సంవత్సరాలు కోర్టు వాయిదాలకు తిప్పి నన్ను ఆర్థికంగా, మానసికంగా చాలా నష్టపరిచారని అన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘంలో నా ఎదుగుదల చూసి ఓర్వలేక ఉద్దేశపూర్వకంగా అన్యాయంగా కేసు నమోదు చేయించారని అన్నారు. ఈ కేసును 27.06.2023 నాడు ఇల్లందు న్యాయస్థానంలో నన్ను నిర్దోషిగా గుర్తించి కేసు కొట్టివేయడం జరిగిందని అన్నారు. బీసీ కార్పొరేషన్ రుణాలకు నాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు కులసంఘంలో పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను.




