వికారాబాద్ రూరల్ జూన్ 29 జనం సాక్షి
వికారాబాద్ జిల్లాలో ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్ర బక్రీద్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు వికారాబాద్ లో బక్రీద్ ప్రార్థనలో అనంతరం ముస్లిం సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు జిల్లాలోని నవాబుపేట మండలం చీట్టిగిద్ద గ్రామంలో మండల కో ఆప్షన్ సభ్యుడు బి ఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు సయ్యద్ గౌస్ ఆధ్వర్యంలో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు హిందూ ముస్లింలు ఐక్యతగా కలిసి ఒకరినొకరు అలింగలం చేసుకున్నారు ముస్లిం సోదరులు త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర బక్రీద్ పండుగను కుర్బానీ ఇచ్చి మాంసాన్ని నిరుపేదలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాజకీయాలకతీతంగా పలు పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
వికారాబాద్ జిల్లాలో ఘనంగా పవిత్ర బక్రీద్ వేడుకలు




