Monday, 2 November 2026

ఘనంగా బీరన్న బోనాల పండుగ

జనం సాక్షి,చెన్నారావుపేటతొలి ఏకాదశి పురస్కరించుకొని మండల కేంద్రంలో బీరన్న దేవుడికి బోనాలు సమర్పించారు.గురువారం గొల్ల కురుమల ఆరాధ్య దైవం బీరన్నకు డప్పు చప్పుల మధ్య బోనాలు తీసుకెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్ద కుండే కట్టయ్య, సారీ గొల్ల రవి, కుండే సురేష్, పోషాలు, కుండే కొమురయ్య, సుధాకర్,కోరే కుమారస్వామి, మంగ సదయ్య, రవితేజ, భూషబోయిన సాంబయ్య, కొమురయ్య, చీర కుమారస్వామి, మజ్జిగ కుమారస్వామి, కంప సారయ్య,రాములు, ఆరె కటయ్య, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.