Wednesday, 4 November 2026

వికారాబాద్ ప్రజావాణిలో 163 దరఖాస్తుల స్వీకరణ

వికారాబాద్ రూరల్ ఆగస్టు 28 జనం సాక్షి
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన ప్రజల నుండి వారి సమస్యలపై 163 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కొసం దూర ప్రాంతాల నుండి ఎంతో నమ్మకంతో వచ్చిన వారి సమస్యలను అర్హతల మేరకు వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.