హైదరాబాద్ : శాసనసభ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కమిటీహాలులో అంబేద్కర్ విగ్రహానికి ఈ రోజు ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వివిధ పార్టీలు ఇచ్చే విగ్రహ నమూనాలను బీఏసీలో పరిశీలించి, చర్చించి ఖరారు చేస్తామని చెప్పారు. శిల్పి రాంసుధకు విగ్రహ ఏర్పాటు బాధ్యతలను అప్పగిస్తామన్నారు.Û




