విగ్రహ ప్రతిష్టపనలో పాల్గొన్న సాకటి దశరథ్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :బుధవారం తాంసీ మండలంలోని

శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న సాకటి దశరథ్.
మండలంలోని  నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన పూజ కార్యక్రమంలో గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్  పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులు పొందరు. అదేవిదంగా ఆలయ అభివృద్ధి కోరకు కృషి చేసిన   వారిని సన్మానించారు. వారితో పాటు పూజ కార్యక్రమాలు నిర్వహించిన పుజారులను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమం లో   జిల్లా ఉపధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి ,మండల అధ్యక్షులు సోమ ప్రవీణ్ రెడ్డి , లీగల్ సెల్ కో కన్వీనర్ ఉమేష్,కాంతారావు, జీవన్,ప్రకాష్,పూర్ణ చందర్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.