విజయం సాధించిన విద్యార్థికి సన్మానం
చిలప్ చేడ్/నవంబర్/జనంసాక్షి :- మార్షల్ ఆర్ట్స్ లో రాణించడంతో ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవడంతోపాటు జీవితంలో ఉన్నత స్థానాలను పొందుతారని తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోచయ్య, నవభారతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ గౌడ్ అన్నారు. హైదరాబాదులో గల చాదర్ ఘాట్ లోని ఇండోర్ స్టేడియంలో స్ట్రాంగ్ చోటెఖాన్ స్పోర్ట్స్ కరాటే డో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండవ నేషనల్ టోర్నమెంట్లో పాఠశాలకు చెందిన భవజ్ఞ పాల్గొని కటాస్, స్పారింగ్ విభాగాలలో పోటీ చేసి రెండు బంగారు పథకాలను సాధించింది. ఛాంపియన్షిప్ ట్రోపీని సైతం కైవసం చేసుకుంది. ఈ మేరకు విద్యార్థి భవజ్ఞను మంగళవారం పాఠశాలలో ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్షల్ ఆర్ట్స్ విద్యతో విద్యార్థులకు చేకూరే పలు ఉపయోగాలను వారు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్, నిరంజన్, రోజా, గంగవేణి, దేవి, శిరీష తదితరులు ఉన్నారు




