రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత
జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 29
-ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
-రేపటి నుంచే అర్లి -లోకేశ్వరం రోడ్డు పునరుద్ధరణ పనులు ప్రారంభం
-త్వరలో మరిన్ని ఆర్ అండ్ బీ రోడ్ల
అభివృద్ధి పనులు
తెలంగాణ ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి, పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో అర్లి -లోకేశ్వరం రోడ్డు పునరుద్ధరణ పనులు రేపటి నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. కుబీర్ మండలంలోని పల్సి- రంజని రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. వానల్ పహాడ్ – లింబా, jawla-తానూర్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే నియోజకవర్గంలోని మిగతా ఆర్ అండ్ బీ రోడ్ల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయించి త్వరలోనే ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు.




