బిచ్కుంద ఏప్రిల్ 14 (జనంసాక్షి) డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బిచ్కుంద మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అరుణ తార పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి చేసినటువంటి సేవలను మార్గ నిర్దేశాలను గుర్తు చేసుకోవడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆ మహ నీయుని జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయం అని, ముఖ్యంగా యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని తాను చిన్నతనంలో నిరక్ష్యానికి, వివక్షతకు గురి అయినా ఎవరిపై కక్ష పెంచుకోకుండా తాను కష్టపడి చదువుకొని అత్యున్నత స్థాయికి వెళ్లి దేశానికి పవిత్రమైన రాజ్యాంగం రాసారని, ఆయన మన జాతి సంపద అని, అంబేద్కర్ మన దేశంలో జన్మించడం ప్రతి భారతీయునికి గర్వ కారణం అని, మహిళలకు అన్ని హక్కులు కావాలని, ముఖ్యంగా విద్యావంతులు అయితేనే అభివృద్ధి సాధిస్తారని అందుకు కృషి చేసారని, విజ్ఞాన గని అంబేద్కర్ ని ఎన్నో డిగ్రీల సాధించిన మేధావి అని, మనకు అందరి అభిప్రాయాలుకు గౌరవిస్తూ, తెల్సుకొని దేశానికీ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో దయానంద్ ఆవలే, శ్రీధర్ పంతులు, శ్రీకాంత్, హన్మండ్లు, మొగులు గొండా, గణపతి, గోపాల్ చారి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




