రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 14. (జనంసాక్షి). భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అందించడం ద్వారా డాక్టర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు ఆత్మ గౌరవాన్ని అందించారని అన్నారు. ఆయన అందించిన స్ఫూర్తి చిరస్మరణీయమని తెలిపారు . కార్యక్రమంలో పెద్దూరు మాజీ సర్పంచ్ ర్యాకం రమేష్, సింగిల్ విండో వైస్ చైర్మన్ బెజ్జారపు నారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎర్రబెల్లి రమణారావు, సింగిల్ విండో డైరెక్టర్లు మంగ కిరణ్, ఉలిచే తిరుపతి, ఆలీ, ఎర్రవెల్లి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.




