Thursday, 5 November 2026

విడాకులు ఇవ్వకుండానే పది పెళ్లిళ్లు!

విడాకులు ఇవ్వకుండానే పది పెళ్లిళ్లు!

న్యూయార్క్: వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ యువకుల్ని బురీడీ కొట్టించడమే ఆ మహిళకు హాబీ. ఎవరైనా వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తితే.. విడాకులు తీసుకుని మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతారు. అయితే అమెరికాకు చెందిన లైనా క్రిస్టినా బారైన్ టోస్(39) కు మాత్రమే పెళ్లిళ్లు చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఇది పరంపరను 1999 ను కొనసాగిస్తూ వస్తోంది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ 10 పెళ్లిళ్లు చేసుకున్నఆమెపై మోసానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. 2002 లో  ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని క్రిస్టినా ఆ సంవత్సరం అంతా బిజీ బిజీగా గడిపింది.

ఆ సంవత్సరం వాలెంటైన్స్ డే రోజున మోసపు పెళ్లికి తెరలేపిన లైనా క్రిస్టినా.. 15 రోజుల తరువాత రాక్ లాండ్ దేశంలో  మరో పెళ్లి చేసుకుంది. మరో నెల రోజుల తరువాత మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఎవరి వద్ద నుంచి విడాకులు మాత్రం పొందకపోవడం గమనార్హం. ఇప్పటివరకూ తన మ్యారేజ్ లైసెన్స్ పై పెళ్లి కానట్టే ధృవీకరించి మోసపు చర్యలకు పాల్పడింది. దీనిపై శుక్రవారం మోసపు కేసు నమోదు చేసిన అధికారులు  దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *