చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ సంఘాలు పార్టీలు గత నాలుగు రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో తమిళనాడు వీధులు మార్మోగుతున్నాయి. పలుచోట్ల ఆందోళనకారులు ఏపీ సీఎం చంద్రబాబు పోస్టర్లను చెప్పులతో కొడుతూ నిరసనలు తెలిపారు. ఇదిలావుంటే ఎండీఎంకే నేత వైగో అధ్యక్షతన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను ఇవాళ.. చిత్తూరు కలెక్టరేట్ ముట్టడి, భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు తమిళనాడు అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
తమిళనాడులు నిరసనల వెల్లువ





