వితంతు మహిళలకు అండగా రాజమాత
ఘట్కేసర్ డిసెంబర్ 29( జనం సాక్షి) దివ్యాంగులకు రాజమాత ఫౌండేషన్ అండగా నిలుస్తోంది.వారికి అన్ని విధాలా సాహాయ సహకారాలు అందజేస్తోంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలోని దివ్యాంగుల కాలనీలో వితంతు మహిళలకు రెండోసారి కుట్టు మిషన్లను అందజేసింది. ఉపాధి లేక బతకడం కష్టంగా మారి, జీవితం అంధకారంలో చిక్కుకుందని బాధపడుతున్న తరుణంలో మేమున్నామంటూ భరోసా ఇస్తూ ముందు కొచ్చివారి జీవితాల్లో వెలుగులు నింపింది రాజమాత ఫౌండేషన్. అందులో భాగంగా యాదమ్మ, బాలామణికి కుట్టు మిషన్లను రాజమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేడయంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కష్టకాలంలో దారిచూపిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే వేములవాడ లక్ష్మికి జీవనోపాధి కల్పించారు. కుట్టుమిషన్ నేర్చించేందుకు ఆమెను వాలంటీర్ గా నియమించారు. గతంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల ఇదే కాలనీలో 225 మంది దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చలికి బాధ పడుతున్న వారి కష్టాలను చూసి దుప్పట్లు పంపిణీ చేసి అందరితో మన్ననలు పొందారు. కొందరు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. నిరుపేద దివ్యాంగ మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన రాజమాత ఫౌండేషన్ ఫౌండర్ ఉదయ్ కుమార్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు సంతోష్ రెడ్డి, పాండులకు మహిళలు, దివ్యాంగులు ధన్యవాదాలు తెలిపారు. మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడంలో కృషి చేసిన సీనియర్ జర్నలిస్టు భూతం లింగయ్య యాదవ్ రాజమాత ఫౌండేషన్ కు కృతజ్ఞతలు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని భూతం లింగయ్య యాదవ్ కోరారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నునెముంతల
రాములు,తిరుపతిలరెడ్డి,యాదగిరి,అన్వరు ,పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు.




